YSRCP: టీడీపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది, ఎమ్మెల్సీలు ముగ్గురు మాతో టచ్ లో ఉన్నారు: వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

  • ఆ ఎమ్మెల్యేలు పదవులు కూడా వద్దన్నారు
  • ఇద్దరు ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు
  • టీడీపీకి భవిష్యత్ లేదని వారు భావిస్తున్నారు

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టీవీ 9’లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో టచ్ లో వున్నారని, వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని అన్నారు. అంతేకాకుండా, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు కూడా వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టీడీపీకి భవిష్యత్ లేదని, చంద్రబాబు తీరు మారదని ఆయా ఎమ్మెల్యేలు భావిస్తున్నారని  కోటంరెడ్డి అన్నారు. టీడీపీని వీడతామని చెప్పిన ఆయా ఎమ్మెల్యేలు తమకు ఎటువంటి పదవి అక్కర్లేదని, జగన్ కు మంచి భవిష్యత్ ఉందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమకు పోటీ చేసే అవకాశం కల్పిస్తే చాలని వారు చెప్పినట్టు తెలిపారు.  

YSRCP
kotamreddy
sridhar reddy
cm
jagan
  • Loading...

More Telugu News