Assembly Session: గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా వెళ్లి కలిసిన జగన్

  • నిన్న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
  • అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జోరుగా వాదోపవాదాలు
  • రేపు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్నంతా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. నేడు స్పీకర్ ఎన్నిక, అనంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు జోరుగా సాగాయి. అయితే రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు గవర్నర్ విజయవాడ చేరుకుని గేట్ వే హోటల్‌లో బస చేశారు. ఆయనను ఏపీ సీఎం జగన్ మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు. గవర్నర్‌ను పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు.  

Assembly Session
Jagan
Narasimhan
Gate Way Hotel
Vijayawada
  • Loading...

More Telugu News