Andhra Pradesh: మరి, నాదెండ్ల మనోహర్ ను ఎందుకు స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు?: చంద్రబాబుకి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్న

  • చంద్రబాబు అసెంబ్లీలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు
  • మనోహర్ కోసం చంద్రబాబు స్పీకర్ కుర్చీ వరకూ వచ్చారు
  • కానీ మిగతావారి కోసం ఎందుకు రాలేదు?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ శాసనసభలో ఈరోజు చంద్రబాబు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్ స్థానంలో తమ్మినేని సీతారామ్ ను కూర్చోబెట్టే కార్యక్రమానికి చంద్రబాబు ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించారు.

2009లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని ఎన్నుకున్నప్పుడు సభాసంప్రదాయాల ప్రకారం ఆయన్ను కుర్చీలో కూర్చోబెట్టేందుకు చంద్రబాబు రాలేదని గుర్తుచేశారు. కానీ నాదెండ్ల మనోహర్ స్పీకర్ అయినప్పుడు మాత్రం చంద్రబాబు వచ్చారన్నారు. ఇందుకు కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

Andhra Pradesh
nadendla manohar
kuran kumar reddy
Chandrababu
Telugudesam
BJP
vishnu vardhabn reddy
  • Loading...

More Telugu News