Andhra Pradesh: టీడీపీ వాళ్లు ఎన్ని గుంజీలు తీసి, లెంపకాయలేసుకున్నా సరిపోదు: ఎమ్మెల్యే రోజా ఫైర్

  • చెవిరెడ్డి వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలా?
  • గతంలో టీడీపీ వాళ్లు ఎలాంటి మాటలు మాట్లాడారు? 
  • ఇలాంటి వ్యక్తులు న్యాయం, సంప్రదాయాల గురించి మాట్లాడతారా?

ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని ‘బంట్రోతు’ అని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. గత ఐదేళ్లలో టీడీపీకి చెందిన శాసనసభ్యులు మాట్లాడిన మాటలకు వాళ్లు ఎన్ని గుంజీలు తీసి, లెంపకాయలు వేసుకున్నా కూడా సరిపోదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పాటైన తొలి శాసనసభలో కాల్ మనీ సెక్స్ రాకెట్ ద్వారా మహిళలను వ్యభిచార కూపంలోకి దింపుతున్న వ్యవహారంపై ఇదే అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చిన తన నోరు నొక్కడానికి తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాపాడుకోవడం కోసం స్పీకర్ స్థానాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు తనను సస్పెండ్ చేయడం న్యాయమా? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులు న్యాయం, సంప్రదాయాల గురించి మాట్లాడతారా? అంటూ నిప్పులు చెరిగారు.

Andhra Pradesh
YSRCP
mla
roja
Chandrababu
  • Loading...

More Telugu News