sanjay kishor: పారితోషికాన్ని డిమాండ్ చేయలేని పరిస్థితికి సావిత్రి వచ్చేశారు: సంజయ్ కిషోర్

  • సావిత్రి జీవిత విశేషాలపై స్పందించిన సంజయ్ కిషోర్
  • సావిత్రిగారి కెరియర్లో అలాంటి మార్పు వచ్చింది
  •  చిన్న పాత్రల్లో సావిత్రిని చూసినప్పుడు బాధ కలగడం సహజం  

సావిత్రి వీరాభిమానిగా ఆమెకి సంబంధించిన అనేక ఫొటోలను .. ఆమె జీవిత విశేషాలను సంజయ్ కిషోర్ సేకరించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "అప్పట్లో సావిత్రిగారు తెలుగులోనే కాదు .. తమిళంలోను స్టార్ హీరోయిన్. అందువలన ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కంటే ఆమె పారితోషికం కాస్త ఎక్కువగానే ఉండేదని నేను విన్నాను.

అలా ఒకానొక దశలో అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న సావిత్రి గారు, చివరిదశలో తనకి ఇంత పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేయలేని స్థితికి చేరుకున్నారు. ఆ దశలో ఆమె చిన్నచిన్న పాత్రలను సైతం చేస్తూ, అయిదు .. ఆరువేల రూపాయలను పారితోషికంగా తీసుకున్న సందర్భాలు వున్నాయి. ఒకప్పుడు తెరపై ఒక వెలుగు వెలిగిన సావిత్రిగారిని, చిన్న చిన్న పాత్రలలో చూసినప్పుడు బాధకలగకుండా ఉండదు" అని చెప్పుకొచ్చాడు. 

sanjay kishor
  • Loading...

More Telugu News