Hyderabad: హైదరాబాద్, నక్లెస్ రోడ్ లో ప్రేమజంటపై దాడి!

  • విహారానికి వెళ్లిన యువతి, యువకుడు
  • యువకుడిపై సామూహిక దాడి
  • తీవ్రంగా గాయపడగా ఆసుపత్రిలో చికిత్స

హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్ లో విహారానికి వెళ్లిన ఓ ప్రేమజంటపై కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటన గత రాత్రి జరుగగా, రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, తన ప్రియురాలితో కలిసి, ఓ యువకుడు నడుస్తూ వెళుతుండగా, కొందరు సామూహిక దాడికి దిగారు. యువకుడిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రేమజంటపై దాడికి దిగిన వారిలో ఒకరిని గుర్తించిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Hyderabad
Necles Road
Lovers
Police
  • Loading...

More Telugu News