savithri: సావిత్రి జీవితం ఓ పాఠం - ఓ గుణపాఠం: సంజయ్ కిషోర్
- సావిత్రి గురించి స్పందించిన సంజయ్ కిశోర్
- 45 సంవత్సరాలకే సావిత్రి చనిపోయారు
- సావిత్రిని చూసి చాలామంది జాగ్రత్తపడ్డారు
తెలుగు తెరకి వెలుగు తెచ్చిన తారగా సావిత్రి కనిపిస్తుంది. అలాంటి సావిత్రికి వీరాభిమానిగా సంజయ్ కిషోర్ కనిపిస్తారు. ఏఎన్నార్ .. ఎస్వీఆర్ లపై పుస్తకాలు రాసిన ఆయన, సావిత్రికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ లు నిర్వహించారు .. డాక్యుమెంటరీలు చేశారు.
అలాంటి ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "సావిత్రిగారు మహానటి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అగ్రకథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఆమె, 45 సంవత్సరాలకే చనిపోయారు. వ్యక్తిగతంగాను .. వృత్తిపరంగాను ఆమె జీవితంలో ఎన్నో ఒడి దుడుకులు వున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితం ఆమెను మరణానికి చేరువగా తీసుకెళ్లింది. అందుకే సావిత్రిగారి నట జీవితం ఒక పాఠంగా కనిపిస్తే, ఆమె వ్యక్తిగత జీవితం ఒక గుణపాఠంగా అనిపిస్తుంది. ఆమె పరిస్థితిని చూసిన చాలామంది తారలు ఆ తరువాత జాగ్రత్తపడ్డారు" అని చెప్పుకొచ్చారు.