Andhra Pradesh: కోడెలపై టీడీపీ నేతలే కేసులు పెడుతున్నారు!: వైసీపీ నేత గోపిరెడ్డి

  • కోడెల ఏనాడైనా ప్రొటోకాల్ పాటించారా?
  • సత్తెనపల్లిలో ఆయన అరాచకాలు చాలా ఉన్నాయి
  • అమరావతిలో మీడియాతో నరసరావుపేట ఎమ్మెల్యే

టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం కోడెలపై కేసులు పెడుతున్న వాళ్లంతా టీడీపీ నేతలేనని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాకే తన కుటుంబంపై పోలీసులు కేసులు పెడుతున్నారని కోడెల చెప్పడం సరికాదని చెప్పారు.

నరసరావుపేటలో కోడెల ఏనాడయినా స్పీకర్ గా ప్రొటోకాల్ పాటించారా? అని ప్రశ్నించారు. అమరావతిలో ఈరోజు మీడియాతో గోపిరెడ్డి మాట్లాడారు. సత్తెనపల్లిలో కోడెల అరాచకాలు చాలా ఉన్నాయని చెప్పారు. చివరికి వీళ్లు అన్న క్యాంటీన్ లోని భోజనాన్ని కూడా మింగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల ఫ్యామిలీ కేసును సీఐడీ విచారణ జరిపించాలని గోపిరెడ్డి డిమాండ్ చేశారు.

Andhra Pradesh
kodela
Telugudesam
gopireddy
srinivasa reddy
  • Loading...

More Telugu News