Sasikala: సత్ప్రవర్తన కింద శశికళ ముందస్తు విడుదల లేనట్టే!

  • నాలుగేళ్ల శిక్షను అనుభవిస్తున్న శశికళ
  • ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తి
  • ముందుగానే విడుదల లేదన్న ఐజీ రూప

పరప్పన అగ్రహార జైల్లో సత్ప్రవర్తన కారణంగా శశికళను ముందస్తుగా విడుదల చేయడం కుదరదని ఐజీ రూప తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017 ఫిబ్రవరి నుంచి శశికళ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె జైలుకు వెళ్లి ఇప్పటికే రెండున్నరేళ్లు అవుతుండగా, మంచి నడవడిక కారణంగా ఆమెను ముందే విడుదల చేస్తారన్న వార్తలు వచ్చాయి.

వీటిపై స్పందించిన కర్ణాటక ఐజీ రూప, ఆ అవకాశం లేదని స్పష్టం చేశారు. సత్ప్రవర్తన కారణంగా ఖైదీల ముందస్తు విడుదలకు అవకాశాలు ఉన్నప్పటికీ, శశికళ విషయంలో వీలుపడదని అన్నారు. కాగా, 1991 నుంచి 1996 మధ్య అన్నాడీఎంకే అధికారంలో ఉన్న వేళ, జయలలిత, శశికళ, ఇళవరసి, వీఎన్‌ సుధాకరన్‌ లు అక్రమంగా ఆదాయాన్ని కూడబెట్టారన్న ఆరోపణలను కోర్టు ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. తుది తీర్పు వచ్చే సమయానికి జయలలిత మరణించగా, మిగతా నిందితులకు నాలుగేళ్ల జైలుశిక్ష పడింది.

Sasikala
Jail
IG Roopa
  • Loading...

More Telugu News