Hardik pandya: హార్దిక్ పాండ్యా నాకంటే ఉన్నతంగా ఎదగాలి: కపిల్ దేవ్

  • పాండ్యా ఓ ఆల్‌రౌండర్ అన్న కపిల్
  • బౌలింగులో మరింత రాణించాల్సి ఉందన్న దిగ్గజ క్రికెటర్
  • అతడిని తనతో పోల్చవద్దని అభిమానులకు విన్నపం

ప్రస్తుత ప్రపంచకప్‌లో అదరగొడుతున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించాడు. అతడు తనకంటే గొప్ప ఆటగాడు కావాలని ఆకాంక్షించాడు. బ్యాటింగ్‌లో తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడని, బౌలింగ్‌లో మరింత రాణించాల్సి ఉందని కపిల్ అభిప్రాయపడ్డాడు. అయితే, హార్దిక్‌ను తనతో పోల్చవద్దని అభిమానులను కోరాడు. అతడి ఆటను అతడిని ఆడనివ్వాలని విజ్ఞప్తి చేశాడు. అతడో ఆల్‌రౌండర్ అని, బౌలింగులో మరింత రాటుదేలుతాడని భావిస్తున్నట్టు చెప్పాడు.

2016 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తర్వాత పాండ్యా రోజురోజుకు రాటుదేలుతున్నాడు. బ్యాట్‌తో అద్భుతాలు చేశాడు. మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే, బౌలింగులో మాత్రం కొంత వెనకబడ్డాడు. ఈ విషయాన్ని కపిల్ ప్రస్తావిస్తూ అతడి బ్యాటింగ్‌పై ఎటువంటి సందేహాలు లేవని, బౌలింగులోనే కొంత మెరుగు కావాల్సి ఉందన్నాడు. అతడికి గొప్ప జట్టు అండగా ఉందని, ఇది చాలా ముఖ్యమని కపిల్ పేర్కొన్నాడు.

Hardik pandya
Kapil dev
ICC World Cup
  • Loading...

More Telugu News