Tollywood: జూనియర్ ఆర్టిస్ట్ ను మోసం చేసిన సినీ రచయిత రమణ గౌతమ్ అరెస్ట్!

  • టాలీవుడ్ లో రచయితగా రమణ గౌతమ్
  • సినీ చాన్స్ ల కోసం ప్రయత్నిస్తున్న భవానితో ప్రేమ
  • తాళి కట్టి, గంటలోనే ఉడాయించిన ఘనుడు

ప్రేమ, పెళ్లి పేరిట ఓ జూనియర్ ఆర్టిస్ట్ ను మోసం చేసి రాత్రికిరాత్రే ఉడాయించి, ఆపై విడాకులంటూ నయా డ్రామాకు తెరతీసిన టాలీవుడ్ రచయిత యర్రంశెట్టి రమణ గౌతమ్ ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. బంజారాహిల్స్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, వైజాగ్‌ ఎంవీపీ కాలనీకి చెందిన రమణ గౌతమ్ (27) సినిమాల్లో రచయితగా పని చేస్తుండగా, ఎన్బీటీ నగర్‌ లో నివసిస్తూ, సినిమాల్లో వేషాల కోసం తిరుగుతుండే భవానీ అనే యువతి పరిచయం అయింది. వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించగా, నాలుగేళ్ల పాటు సహజీవనం చేశారు
.
పెళ్లి చేసుకోవాలని కోరితే తప్పించుకు తిరుగుతున్న రమణ గౌతమ్ పై భవాని ఫిర్యాదు చేయగా, భయపడి, అదే రోజు రాత్రి ఓ గుడికి తీసుకెళ్లి మెడలో తాళి కట్టాడు. ఆపై గంట వ్యవధిలోనే పారిపోయి, తెల్లారి ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భవాని మరోసారి పోలీసులను ఆశ్రయించింది. రమణను అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.

Tollywood
Ramanagoutam
Arrest
Love
Marriage
Police
  • Loading...

More Telugu News