Hyderabad: సూర్యాపేటలో డీసీఎంను ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు.. ఒకరి మృతి

  • హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న బస్సు
  • మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనం
  • నలుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు డీసీఎంను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని దుర్గాపురం స్టేజీ వద్ద ఈ ఘటన జరిగింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న బస్సు డీసీఎంను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో దుర్గమ్మ (62) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
Visakhapatnam District
private travel bus
Road Accident
Nalgonda District
  • Loading...

More Telugu News