Telangana: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా మాట్లాడొద్దు: బీజేపీ నేతలకు కర్నె ప్రభాకర్ హితవు

  • రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి
  • పోలీసుల ఆత్మస్థయిర్యం దెబ్బతీసేలా మాట్లాడొద్దు
  • మిస్సింగ్ కేసుల అంశాన్ని సీఎంకు ముడిపెట్టి మాట్లాడటం దారుణం

తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులో లేవంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ విరుచుకుపడ్డారు.ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, టెక్నాలజీని వినియోగించి నిందితులను గంటలోపే పట్టుకున్న చర్రిత తెలంగాణ ప్రభుత్వానిదని గుర్తుచేశారు. తెలంగాణలో మిస్సింగ్ కేసుల అంశాన్ని సీఎంకు ముడిపెట్టి మాట్లాడటం దారుణమని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో ఉగ్రవాద మూలాలు ఉన్నాయని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, పోలీసుల ఆత్మస్థయిర్యం దెబ్బతీసేలా మాట్లాడొద్దని సూచించారు.

Telangana
Hyderabad
bjp
TRS
karne prabhakar
  • Loading...

More Telugu News