Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్

  • జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన మరో 6 నెలల పొడిగింపు  
  • కేంద్రీయ విద్యా సంస్థల బిల్లుకూ మంత్రి వర్గం ఆమోదం
  • పార్లమెంట్ సమావేశాల్లో త్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెడతాం

జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ బిల్లు ద్వారా అంతర్జాతీయ సరిహద్దు గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. విద్య, ఉద్యోగం, పదోన్నతుల్లో సరిహద్దు ప్రజలకు రిజర్వేషన్ల సౌకర్యం లభిస్తుందని చెప్పారు.

జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలల పొడిగింపునకు కేంద్రం ఆమోదం లభించిందని అన్నారు. వచ్చే నెల 3 నుంచి మరో ఆరు నెలల పాటు జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని తెలిపారు. కేంద్రీయ విద్యా సంస్థల బిల్లుకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. కేంద్రీయ విద్యా సంస్థల్లో ఏడు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో త్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News