YSRCP: ఈ నెల 14న ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్

  • ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు
  • 15న జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ సమావేశం
  • తమ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న జగన్

ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఎంపీలకు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీ రాత్రికి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో 15వ తేదీన జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించనున్నారు. ఉభయ సభల్లో వ్యవహరించాల్సిన తీరుపై తమ ఎంపీలకు పలు సూచనలు చేయనున్నట్టు సమాచారం. ప్రత్యేక హోదా, విభజన హామీల, కేంద్ర నిధుల డిమాండ్ కు వ్యూహ రచన చేస్తారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

YSRCP
cm
jagan
parliament
sessions
  • Loading...

More Telugu News