ap: ఏపీని మరో బెంగాల్ చేయవద్దు: బీజేపీ నేత ఆంజనేయరెడ్డి

  • రాజకీయ దాడులు చోటు చేసుకోవడం బాధాకరం
  • ఇలాంటి దాడులను జగన్ అరికట్టాలి
  • ఇసుక మాఫియాను అణచివేయాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ దాడులు చోటు చేసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఏపీని మరో పశ్చిమబెంగాల్ లా మార్చవద్దని... ఇలాంటి దాడులను ముఖ్యమంత్రి జగన్ వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీతో జగన్ కు ఉన్న సఖ్యత బాగుందని... కేంద్రంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలను అణచివేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ap
jagan
ysrcp
bjp
anjaneya reddy
  • Loading...

More Telugu News