Yuvraj Singh: నా బిడ్డ క్రికెట్ కెరీర్ ను నాశనం చేసింది గ్రెగ్ చాపెల్: యువరాజ్ తండ్రి తీవ్ర ఆరోపణలు

  • ఖోఖో ఆడుతూ యువీ గాయపడ్డాడు
  • ఆ దెబ్బ యువీ స్టయిల్ ను ప్రభావితం చేసింది
  • చాపెల్ ను ఎప్పటికీ క్షమించలేను

డాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఆయన తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. యువరాజ్ క్రికెట్ కెరీర్ దెబ్బతినడానికి అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్ విధానాలే కారణమని యోగ్ రాజ్ ఆరోపించారు. చాపెల్ కోచ్ గా ఉన్న సమయంలో మ్యాచ్ కు ముందు ఖోఖో ఆడించేవాడని, ఓసారి ఖోఖో ఆడుతూ యువరాజ్ గాయపడ్డాడని వెల్లడించారు.

గాయం యువరాజ్ కెరీర్ పై ఎంతో ప్రభావం చూపించిందని, గాయం కారణంగా యువరాజ్ తన సహజశైలిని కోల్పోయాడని వివరించారు. ఆ దెబ్బే తగలకుండా ఉంటే వన్డే, టి20 క్రికెట్లో ఎన్నో రికార్డులు ఇవాళ తన కొడుకు ముందు మోకరిల్లేవని అభిప్రాయపడ్డారు. తన బిడ్డ కెరీర్ దెబ్బతినడానికి కారణమైన చాపెల్ ను ఎప్పటికీ క్షమించలేనని యోగ్ రాజ్ స్పష్టం చేశారు. యువరాజ్ కు క్యాన్సర్ అని తెలియగానే గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, అయితే తన బాధను కొడుకు ముందు ఏనాడూ ప్రదర్శించలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News