Narendra Modi: పాకిస్థాన్ మీదుగా మన విమానం పోకూడదు.. ప్రధాని మోదీ అనూహ్య నిర్ణయం!

  • ఈ నెల 13-14లో బిష్కెక్ లో ఎస్సీవో సదస్సు
  • తొలుత పాక్ గగనతలం నుంచి వెళ్లేందుకు అనుమతి కోరిన భారత్
  • అంతలోనే నిర్ణయం మార్చుకున్న ప్రధాని మోదీ

కిర్గిజిస్థాన్ లో ఈ నెల 13-14 తేదీల్లో జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు అవుతున్నారు. అయితే ఈ భేటీకి పాక్ మీదుగా వెళ్లేందుకు వీలుగా మోదీ విమానం ‘ఎయిరిండియా వన్’ కు అనుమతి ఇవ్వాలని కేంద్రం పాకిస్థాన్ సర్కారును కోరింది. ఇందుకు పాక్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. అయితే పాక్ మీదుగా ఎస్సీవో సదస్సుకు వెళ్లరాదని మోదీ నిర్ణయించారు.

ఇరాన్, ఒమన్ మీదుగా కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్ కు చేరుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా ఎస్సీవో సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో భేటీ కాబోరని విదేశాంగ శాఖ కార్యదర్శి రవీశ్ కుమార్ తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మోదీ వేర్వేరుగా సమావేశమవుతారని వెల్లడించారు. ఎస్సీవోలో చైనా, భారత్, పాకిస్థాన్ సహా 8 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News