Telangana: కరీంనగర్ బిడ్డగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా!: మంత్రి ఈటల రాజేందర్

  • రాజకీయ నేతలకు రిటైర్మెంట్ ఉండదు
  • పదవీకాలంలో ఎంత మంచి చేశామన్నదే ముఖ్యం
  • కరీంనగర్ జెడ్పీ సమావేశంలో మాట్లాడిన ఈటల

మంత్రిగా సొంత జిల్లా అయిన కరీంనగర్ కు న్యాయం చేస్తానని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ ఉండదని వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈరోజు జరిగిన జెడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

మంత్రి పదవిలో ఎంతకాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు.. మన పదవీకాలంలో ఎంత మంచి చేశామన్నదే ముఖ్యం అని చెప్పారు. ప్రస్తుతం స్థానిక సంస్థలకు పెండింగ్ లో ఉన్న బిల్లులను త్వరలోనే విడుదల చేస్తామని రాజేందర్ హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.

Telangana
Karimnagar District
etala
rajender
minister
  • Loading...

More Telugu News