gandra venkararamana reddy: రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను ఉపయోగించుకున్నాం: గండ్ర వెంకటరమణారెడ్డి

  • మూడింట రెండొంతుల మంది ఒప్పుకుంటే శాసనసభాపక్షాన్ని విలీనం చేయొచ్చు
  • కాంగ్రెస్ తో విభేదించి టీఆర్ఎస్ లో చేరాం
  • ఇంకా టీఆర్ఎస్ కండువా కప్పుకోలేదు

మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు కోరుకుంటే శాసనసభాపక్షం విలీనం కావొచ్చని రాజ్యాంగం చెబుతోందని... రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను ఉపయోగించుకున్నామని టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము కూడా కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. చివరకు బీజేపీ కూడా తమను విమర్శిస్తోందని... త్రిపుర, గోవాల్లో ఆ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో విభేదించి తాము టీఆర్ఎస్ లో చేరామని... అయినా ఇప్పటికీ టీఆర్ఎస్ కండువాలను కప్పుకోలేదని చెప్పారు.

gandra venkararamana reddy
congress
TRS
  • Loading...

More Telugu News