North Korea: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తో లవ్ లో ఉన్నాను!: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

  • అణు నిరాయుధీకరణపై ఇరుదేశాల చర్చలు
  • కిమ్ పై తనకు నమ్మకం ఉందన్న ట్రంప్
  • ఇప్పటికే రెండుసార్లు ట్రంప్-కిమ్ భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ల మధ్య విచిత్రమైన అనుబంధం సాగుతోంది. అణు నిరాయుధీకరణ విషయంలో కొద్దికాలం క్రితం వరకూ ఒకరినొకరు తీవ్ర పదజాలంతో దూషించుకున్న ఇద్దరు నేతలు ఇప్పుడు ప్రేమ సందేశాలు పంపించుకుంటున్నారు. తాజాగా ఉత్తరకొరియా అధినేత కిమ్ తనకు లేఖ రాసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

అణు నిరాయుధీకరణ విషయంలో ఉత్తరకొరియావైపు నుంచి ఇంకా ఎలాంటి పురోగతి లేదన్నారు. అయినా కిమ్ మాటమీద నిలబడతారన్న నమ్మకం తనకు ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను, కిమ్ ప్రేమలో ఉన్నామని చమత్కరించారు. ఉత్తరకొరియా అణు ఆయుధాలను త్యజిస్తే అభివృద్ధికి సహకరిస్తామని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ట్రంప్-కిమ్ రెండుసార్లు సమావేశమయినప్పటికీ, ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదు.

North Korea
kim
USA
Donald Trump
love
denuclearisation
  • Loading...

More Telugu News