Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ హామీ.. సమ్మె ఆలోచనను విరమించుకున్న ఆర్టీసీ జేఏసీ!

  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న సీఎం
  • ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యాలు అందిస్తామని హామీ
  • సీఎం జగన్ నిర్ణయంపై ఆర్టీసీ జేఏసీ హర్షం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు ఈరోజు కలుసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలనీ, లేదంటే సమ్మెకు వెళ్లడం తప్ప తమకు మరో గత్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై సీఎం జగన్ స్పందిస్తూ... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులు పొందే సౌకర్యాలన్నీ ఆర్టీసీ కార్మికులకు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు, సిబ్బందికి సంబంధించిన న్యాయపరమైన అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సీఎం నిర్ణయంతో సంతృప్తి చెందిన ఆర్టీసీ జేఏసీ రేపటి నుంచి చేపట్టాల్సిన నిరవధిక సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. విలీన ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలలు పడుతుందని సీఎం చెప్పారన్నారు.

Andhra Pradesh
Jagan
YSRCP
Chief Minister
rtc jac
strike
cancelled
  • Loading...

More Telugu News