tv9: టీవీ9 వివాదం.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నటుడు శివాజీ!

  • పోలీసులు నాపై తప్పుడు కేసు పెట్టారు
  • కనీసం విచారణ కూడా జరపలేదు
  • క్వాష్ పిటిషన్ దాఖలుచేసిన నటుడు

టీవీ 9 ఛానల్ ఫోర్జరీ, షేర్ల బదిలీ వివాదంపై ప్రముఖ నటుడు శొంఠినేని శివాజీ ఈరోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏబీసీఎల్ కంపెనీలో 40 వేల షేర్ల కోసం రవిప్రకాశ్ కు 2018, ఫిబ్రవరి 19న తాను రూ.20 లక్షలు ఇచ్చానని శివాజీ పిటిషన్ లో తెలిపారు.

అయితే ఎన్సీఎల్టీలో కేసు ముగిశాక షేర్ల బదిలీ చేస్తానంటూ రవిప్రకాశ్ చెప్పారన్నారు. అయితే ఈ షేర్ల బదిలీ వ్యవహారం కుట్రపూరితంగా జరిగిందని తనపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు కనీస విచారణ జరపకుండా తనపై కేసు నమోదు చేశారని, కాబట్టి ఈ కేసును కొట్టేయాలని ధర్మాసనాన్ని కోరారు.

tv9
sivaji
forgery
Cheating
shares
quash petition
Telangana
High Court
  • Loading...

More Telugu News