sunil: ఉత్కంఠను రేకెత్తించే థ్రిల్లర్ మూవీ రీమేక్ లో సునీల్

  • హిందీలో హిట్ కొట్టిన 'అంధాదూన్'
  • ఆయుష్మాన్ క్రేజ్ పెంచిన పాత్ర 
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు      

ఇటీవల హిందీలో వచ్చిన 'అంధాదున్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రధారిగా చేసిన ఈ సినిమా, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో అంధుడిగా ఆయుష్మాన్ అదరగొట్టేశాడు.

అలాంటి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో కథానాయకుడిగా చేసే ఛాన్స్ సునీల్ కి వచ్చింది. ఆయన ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. తన కెరియర్లో ఇదొక చెప్పుకోదగిన సినిమా అవుతుందనే ఉద్దేశంతో సునీల్ ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఇప్పుడిప్పుడే కమెడియన్ గా మళ్లీ బిజీ అవుతోన్న సునీల్, హీరోగా మరో సినిమా చేయనున్నాడన్న మాట.

  • Loading...

More Telugu News