Rishab Pant: కలిసొచ్చిన అదృష్టం... లండన్ బయలుదేరనున్న రిషబ్ పంత్!

  • నెలన్నర క్రితం చోటు దక్కించుకోలేక పోయిన పంత్
  • ధావన్ గాయపడటంతో రిషబ్ కు పిలుపు
  • ఒకటి లేదా రెండు రోజుల్లో జట్టులో చేరిక

దాదాపు నెలన్నర క్రితం వరల్డ్ కప్ ఆడే భారత క్రికెట్ జట్టులో చోటు ఖాయమని వార్తలు వచ్చినా, ఆపై తుది జట్టులో చోటు సంపాదించుకోలేక పోయిన రిషబ్ పంత్ కు అదృష్టం కలిసి వచ్చింది. మూడు రోజుల నాడు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ బొటనవేలి ఎముకకు గాయం కావడం, ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేయడంతో అతని స్థానంలో రిషబ్ పంత్ ను లండన్ కు పంపాలని బీసీసీఐ నిర్ణయించింది.

ఈ మేరకు అధికారుల నుంచి పిలుపును అందుకున్న రిషబ్, లండన్ కు బయలుదేరేందుకు సన్నద్ధమవుతున్నాడు. సాధ్యమైనంత త్వరగా లండన్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్న సమాచారం తనకు అందిందని రిషబ్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ లో ఉన్న బీసీసీఐ అధికారి ఒకరు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ధావన్ స్థానంలో రిషబ్ రానున్నాడని తెలిపారు.

Rishab Pant
Cricket
BCCI
London
  • Loading...

More Telugu News