Andhra Pradesh: తప్పు చేస్తే వేటు వేస్తామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు!: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

  • అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గౌరవిస్తాం
  • ముందు మంత్రులు నిజాయితీగా ఉండాలి
  • మీడియాతో మాట్లాడిన నెల్లూరు వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తామనీ, శాసన సభను హుందాగా నడిపిస్తామని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఏ హామీలైతే ఇచ్చామో, అవి నెరవేర్చే విధంగా జగన్ ముందుకు పోతున్నారని ప్రశంసించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడారు.

మంత్రులు ఎవరైనా తప్పు చేస్తే బాధ్యతల నుంచి తప్పిస్తామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రులు నిజాయతీగా పనిచేస్తే కిందిస్థాయి సిబ్బంది కూడా నిజాయతీగా బాధ్యతలు నిర్వర్తిస్తారని అభిప్రాయపడ్డారు. ఏపీని దేశమంతా అనుసరించేలా వైఎస్ జగన్ పాలన ఉంటుందని స్పష్టం చేశారు. నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Andhra Pradesh
assembly
Minister
anil kumar yadav
  • Loading...

More Telugu News