Jogulamba Gadwal District: మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కన్నుమూత

  • కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న భీముడు
  • నిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూత
  • పలువురి నేతల సంతాపం

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అస్వస్థుడిగా ఉన్న భీముడు నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. 1999లో భీముడు గద్వాల నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. భీముడు మృతికి గద్వాల ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. పరిషత్‌ విజయోత్సవాలను నిర్వహించవద్దని పార్టీ నాయకులను కోరారు. భీముడు మృతిపట్ల మంత్రులు శ్రీనివాస్ గౌడ్,  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ‌ సంతాపం ప్రకటించారు.

Jogulamba Gadwal District
ex.MLA
paased away
  • Loading...

More Telugu News