Andhra Pradesh: ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు!

  • ప్రారంభమైన 15వ అసెంబ్లీ సమావేశాలు
  • జగన్, బాబు చేత ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్
  • ప్రమాణం చేసిన కొడాలి నాని, మేకపాటి, సుచరిత

ఆంధ్రప్రదేశ్ 15 అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ముందుగా ఏపీ అసెంబ్లీ  ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేత పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు సభలో అందరికీ నమస్కరిస్తూ జగన్ అసెంబ్లీలోకి వచ్చారు. మరోవైపు జగన్ అనంతరం టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేత కుప్పం ఎమ్మెల్యేగా ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు.

వీరిద్దరి తర్వాత మంత్రులు అంజాద్ బాషా, మేకపాటి గౌతమ్ రెడ్డి, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత తదితరులు కూడా ప్రమాణం చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయదుందుభి మోగించగా, టీడీపీ 23 సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. జనసేన పార్టీ రాజోలులో ఖాతా తెరవగలిగింది.

Andhra Pradesh
Chandrababu
Jagan
assembly
oath taking
  • Loading...

More Telugu News