killi kruparani: జన్మభూమి కమిటీల మాఫియా వల్లే టీడీపీ అధికారం కోల్పోయింది : కేంద్ర మాజీ మంత్రి కిళ్లి కృపారాణి

  • అందుకే జగన్‌ చరిత్ర సృష్టించాలి
  • పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు
  • కక్ష సాధింపు చర్యలు ఆయన చేపట్టరు

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమికి ఆ పార్టీ గ్రామ స్థాయిలో నియమించిన జన్మభూమి కమిటీల మాఫియాయే కారణమని  కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన సుదీర్ఘ పాదయాత్రతో జనంలో నమ్మకం కలిగించి అద్భుత విజయంతో జగన్‌ చరిత్ర సృష్టించారన్నారు. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మంత్రివర్గం కూర్పుతోనే తన నేర్పును జగన్‌ ప్రదర్శించారని, ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందుతుందన్నారు. ఇసుక మాఫియాకు ప్రభుత్వం బ్రేక్‌ వేయనుండడం సంతోషించాల్సిన విషయమన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ జగన్‌ నెరవేరుస్తారని చెప్పారు. కక్ష సాధింపు చర్యలకు జగన్‌ ఎప్పుడూ దూరమన్నారు.

killi kruparani
Jagan
government
  • Loading...

More Telugu News