tiktok: టిక్ టాక్ వీడియోలపై భర్త మందలింపు.. విషం తాగి భార్య ఆత్మహత్య!

  • తమిళనాడులోని పెరంబూర్ లో ఘటన
  • భార్య వ్యవహారశైలిపై భర్త ఆగ్రహం
  • టిక్ టాక్ వీడియోలు ఆపేయాలని మందలింపు

చైనాకు చెందిన వీడియో తయారీ యాప్ టిక్ టాక్ ను వాడుతూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని పెరంబూర్ లో చోటుచేసుకుంది. పెరంబూర్ లో ఓ జంట నివాసం ఉంటోంది. ఈ క్రమంలో టిక్ టాక్ వాడుతున్న భార్యను భర్త మందలించాడు. వాటికి దూరంగా ఉండాలని సూచించాడు.

దీంతో మనస్తాపానికి లోనైన సదరు వివాహిత టిక్ టాక్ వీడియో చేస్తూనే విషం తాగింది. బయటనుంచి ఇంటికి వచ్చిన భర్త భార్య అచేతనంగా పడిఉండటాన్ని గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

tiktok
video
wife suicide
husband warning
poision
Tamilnadu
  • Loading...

More Telugu News