gov.vip: మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వ విప్‌ చాన్స్‌

  • ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ సర్కారు
  • ఇప్పటికే ఐదుగురికి అవకాశం
  • తాజా నిర్ణయంతో మొత్తం విప్‌లు ఎనిమిది మంది

ఆంధ్రప్రదేశ్‌ నూతన శాసన సభలో ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురికి అవకాశం దక్కింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలను విప్‌లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గం కూర్పులో అవకాశం దక్కని వారు అసంతృప్తికి గురికాకుండా ఉండేందుకు ఇప్పటికే ఐదుగురిని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వ విప్‌లుగా నియమించిన విషయం తెలిసిందే. వీరిలో రాయచోటి ఎమ్మెల్యే గడిచోట శ్రీకాంత్‌రెడ్డిని చీఫ్‌ విప్‌ (కేబినెట్‌ హోదా)గా నియమించగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడులను విప్‌లుగా జగన్‌ నియమించారు. తాజా నియామకాలతో మొత్తం విప్‌ల సంఖ్య ఎనిమిదికి చేరినట్టయింది.

  • Loading...

More Telugu News