Hyderabad: ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినందుకు కోప్పడిన తండ్రి.. ఆత్మహత్య చేసుకున్న పురోహితుడు

  • హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఘటన
  • తండ్రికి తెలియకుండా రూ.70 వేలు డ్రా
  • మందలించినందుకు ఆలయంలో ఉరేసుకుని ఆత్మహత్య

తనకు తెలియకుండా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసిన కొడుకును మందలించాడో తండ్రి. ఈ విషయంలో చిన్నపాటి గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జయరాంనగర్‌కు చెందిన జగదీశ్ కుమారుడు వినయ్‌కుమార్ (22) స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో పురోహితుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల తండ్రికి తెలియకుండా అతడి ఖాతా నుంచి వినయ్ రూ.70 వేలు డ్రా చేశాడు.

విషయం తెలిసిన తండ్రి జగదీశ్ కుమారుడిని మందలించాడు. ఆ డబ్బులు ఎవరికి ఇచ్చావంటూ ప్రశ్నించాడు. ఇదే విషయమై సోమవారం కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వినయ్ మంగళవారం ఉదయం ఆలయానికి వెళ్లి పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
Jeedimetla
Suicide
Telangana
  • Loading...

More Telugu News