YSRCP: వైసీపీకి డిప్యూటీ స్పీకరా? నాకు తెలీదు: జీవీఎల్

  • ఆ విషయం నా దృష్టికి రాలేదు
  • అధిష్ఠానమే నిర్ణయిస్తుంది
  • బీజేపీలో ఎవరైనా చేరితే స్వాగతిస్తాం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ, అటువంటి విషయమేదీ తన దృష్టికి రాలేదని, ఉప సభాపతి ఎవరికి ఇస్తారో తనకు తెలియదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.

 నిన్న తాడేపల్లికి వచ్చిన ఆయన సీఎం జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆపై మీడియాతో మాట్లాడిన ఆయన, డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని పార్టీ అధిష్ఠానమే చూసుకుంటుందని అన్నారు. జగన్ కు అభినందనలు తెలిపేందుకే వచ్చానని, గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని అంశాలపై ఆయనతో చర్చించానని అన్నారు. ప్రజలకు సేవ చేయాలని భావించే వారు ఎవరైనా బీజేపీలో చేరవచ్చని, వారిని స్వాగతిస్తామని చెప్పిన జీవీఎల్, టీడీపీ నుంచి రాష్ట్ర స్థాయి నేతలెవరైనా బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తే, పార్టీలో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

YSRCP
Deputy Speaker
GVL
Jagan
  • Loading...

More Telugu News