cm: మేం పదవుల కోసం పనిచేయలేదు.. రాజన్న రాజ్యం కోసం కష్టపడ్డాం!: ఎమ్మెల్యే రోజా

  • నాకు మంత్రి పదవి కన్నా జగన్ సీఎం కావడమే ఆనందం
  • రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు మేము కష్టపడ్డాం
  • వైసీపీలో అలగడం, బుజ్జగింపులు వంటివి ఉండవు

సీఎం వైఎస్ జగన్ ని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈరోజు కలిశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, జగన్ ని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. తనకు మంత్రి పదవి కన్నా జగన్ సీఎం కావడం ఆనందంగా ఉందని, ఆయన ముఖ్యమంత్రి అయితే తాము కూడా అయినట్టేనని వ్యాఖ్యానించారు. భవిష్యత్ లో మంత్రి పదవి వస్తుందని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. వాస్తవం చెప్పాలంటే, పదవుల కోసం తాము పని చేయలేదని, రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే కష్టపడ్డామని అన్నారు. మంత్రి పదవి దక్కలేదని రోజా అలిగారన్న వార్తలపై ఆమె స్పందిస్తూ, వైసీపీలో అలగడాలు, బుజ్జగింపులు వంటివి ఏమీ ఉండవని చెప్పారు. ‘నవరత్నాలు’ అమలు చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పిన రోజా, తన నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. 

cm
jagan
YSRCP
mla
roja
tadepalli
  • Loading...

More Telugu News