Deputy Speaker: వైసీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్.. జాతీయ మీడియాలో విస్తృత ప్రచారం!

  • మూడో స్థానాన్ని దక్కించుకున్న వైసీపీ
  • బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్న జేడీయూ
  • బీజేపీతో సఖ్యతగా ఉంటూ వస్తున్న వైసీపీ

కీలకమైన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి బీజేపీ ఆఫర్ చేసినట్టు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ 22 సీట్లను సాధించి సభలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గ కూర్పు అనంతరం ఎన్డీయేలో భాగస్వామ్య పక్షమైన జేడీయూ బీజేపీకి దూరంగా ఉంటూ వస్తోంది. దీంతో జేడీయూ స్థానాన్ని వైసీపీతో భర్తీ చేయాలనే ఆలోచనకు బీజేపీ వచ్చినట్టు తెలుస్తోంది. ఇవన్నీ వైసీపీకి కలిసొస్తున్న అంశాలుగా పరిణమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీకి బీజేపీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసినట్టు జాతీయ మీడియా పేర్కొంటోంది. అయితే దీనిపై వైసీపీ మాత్రం ఇంకా స్పందించలేదు.

Deputy Speaker
YSRCP
Telugudesam
BJP
JDU
National Media
  • Loading...

More Telugu News