jupudi prabhakar: ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన జూపూడి ప్రభాకర్

  • సోషల్ వెల్ఫైర్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాజీనామా లేఖ
  • కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రాజీనామా చేసినట్టు వెల్లడి 
  • ఈ అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్న జూపూడి 

ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోషల్ వెల్ఫేర్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించారు. గత ప్రభుత్వ హయాంలో తాను ఈ పదవిని చేపట్టానని... కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తన రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. ఎస్సీలతో పాటు ఇతర బలహీన సామాజికవర్గాలతో కలసి పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ప్రజల కోసం పని చేసే అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు.

jupudi prabhakar
resign
Telugudesam
  • Loading...

More Telugu News