Governer Narasimhan: గవర్నర్ నరసింహన్ ను మారుస్తారన్న వదంతులు నమ్మొద్దు : జీవీఎల్
- ఇప్పట్లో అలాంటి యోచన కేంద్రానికి లేదు
- గవర్నర్ గా సుష్మా స్వరాజ్ ను నియమిస్తారన్నది అబద్ధం
- మా పార్టీలో చేరే వారిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను మారుస్తున్నారని, ఆ స్థానంలో సుష్మా స్వరాజ్ ను నియమిస్తారంటూ వస్తున్న వదంతులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న ఈ వదంతులను నమ్మొద్దని, ఇప్పట్లో నరసింహన్ ను మార్చే యోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ, 2020 నాటికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీలో చేరే వారిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సేవా భావంతో పార్టీలోకి వస్తానంటే వారిని తప్పకుండా ఆహ్వానిస్తామని చెప్పారు. పార్టీలో అంతర్గత చర్చ జరిగిన తర్వాతే ఆయా పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకుంటామని వివరించారు.