YSRCP: జగన్ గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఎలా?: ఎమ్మెల్యే రోజా

  • రేపటి నుంచి  ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • ఈరోజు విజయవాడ చేరుకున్న రోజా
  • ఇప్పటికే ఎన్నో పోస్టులు ఛానెల్స్ వాళ్లు ఇచ్చేశారు

రేపటి నుంచి  ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈరోజు విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను మీడియా పలకరించింది.

మీకు మంత్రి పదవి దక్కకపోవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారన్న ప్రశ్నకు రోజా బదులిస్తూ, ‘జగన్ గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే నేనేం చెప్పగలను?’ అంటూ నవ్వులు చిందించారు.

మీకు మంత్రి పదవి దక్కలేదు కనుక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోందన్న ప్రశ్నకు రోజా స్పందిస్తూ, ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు నుంచి ఇప్పటికే ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులను ఛానెల్స్ వాళ్లు తనకు ఇచ్చేశారని, ఇక, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారని ఛలోక్తి విసిరారు.

YSRCP
jagan
cm
mla
roja
  • Loading...

More Telugu News