Andhra Pradesh: బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి.. ఇకపై నేనూ దూకుడుగానే ఉంటా: సాధినేని యామిని

  • ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసిన యామిని
  • తన పేరిట వస్తున్న ఫేక్ పోస్టింగ్స్  విషయమై ఫిర్యాదు
  • తగు చర్యలు తీసుకోవాలని కోరిన యామిని

సోషల్ మీడియా వేదికగా తన పేరుతో ఫేక్ పోస్ట్ లు పెడుతున్నారంటూ టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని నిన్న ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఈరోజు ఆమె కలిశారు. తన పేరిట వస్తున్న ఫేక్ పోస్టింగ్స్ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం, మీడియాతో యామిని మాట్లాడుతూ, సీఎం జగన్ పై ఎలాంటి అసభ్యకర పోస్టులు తాను పెట్టలేదని, ఎవరిపైనా తాను వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తనకు, తన భర్తకు ఫోన్ చేసి బెదిరించేలా మాట్లాడుతున్నారని, ఇకపై తానూ దూకుడుగానే ఉంటానని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Telugudesam
spokes person
yamini
  • Loading...

More Telugu News