Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కర్ణాటక సీఎం కుమారుడు నిఖిల్ గౌడ భేటీ!

  • జగన్ నివాసానికి వచ్చిన నిఖిల్
  • మర్యాద పూర్వకంగానే కలసినట్లు వ్యాఖ్య
  • మాండ్య ఎంపీ నియోజకవర్గంలో ఓడిపోయిన నిఖిల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఈరోజు కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు, జేడీఎస్ నేత నిఖిల్ గౌడ కలుసుకున్నారు. ఈరోజు అమరావతిలోని జగన్ నివాసానికి వచ్చిన నిఖిల్, జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో ఏం చర్చించారన్న విషయమై తెలియరాలేదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాండ్య లోక్ సభ స్థానం నుంచి నిఖిల్ గౌడ పోటీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి సుమలత చేతిలో 98,000 పైచిలుకు ఓట్ల తేడాతో నిఖిల్ ఓటమి పాలయ్యారు.

Andhra Pradesh
Chief Minister
Karnataka
nikhil gowda
Jagan
  • Loading...

More Telugu News