Andhra Pradesh: మాకు కనీసం ఛాంబర్ ఇవ్వకుండా అవమానించారు.. కానీ మేం హుందాగా వ్యవహరిస్తాం!: గడికోట శ్రీకాంత్ రెడ్డి

  • రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • తొలుత జగన్, తర్వాత చంద్రబాబు ప్రమాణం
  • గురువారం స్పీకర్ గా తమ్మినేని ఎన్నిక

ఎన్నికల మేనిఫెస్టోను అమలుచేసే దిశగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తొలి కేబినెట్ భేటీలోనే పలు నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశంసించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి సమావేశమవుతాయని చెప్పారు. తొలుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారని వెల్లడించారు. గురువారం స్పీకర్ గా తమ్మినేని సీతారాంను ఎన్నుకుంటామన్నారు.

ఈ నెల 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. సభను తాము ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిర్వహిస్తామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం, స్పీకర్ లా కాకుండా హుందాగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాన్ని కూడా గౌరవించి సభలో అవకాశం ఇస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులైన తమకు ఛాంబర్ కూడా ఇవ్వకుండా అవమానించిందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కానీ తాము మాత్రం అందరికీ సరైన ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News