కల్యాణ్ రామ్ జోడీగా మెహ్రీన్
- గ్లామరస్ హీరోయిన్ గా మెహ్రీన్
- నచ్చిన పాత్రలకే గ్రీన్ సిగ్నల్
- సతీశ్ వేగేశ్న సినిమాలో ఛాన్స్
ప్రస్తుతం కల్యాణ్ రామ్ .. వేణు మల్లిడి దర్శకత్వంలో 'తుగ్లక్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సతీశ్ వేగేశ్నతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా కోసమే కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నారు. ఇంతవరకూ సతీశ్ వేగేశ్న 'శతమానం భవతి' .. ' శ్రీనివాస కల్యాణం' వంటి కుటుంబ కథాచిత్రాలనే తెరకెక్కించారు. ఇప్పుడు చేయనున్న సినిమా యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో మెహ్రీన్ పాత్రకి కూడా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.