chiranjeevi: 'సైరా' కోసం చిరంజీవి కూతురు సుస్మిత నా దుస్తుల్ని డిజైన్‌ చేశారు: తమన్నా

  • ముగింపు దశలో 'సైరా'
  • యువరాణి పాత్రలో తమన్నా
  •  తమన్నా కోసం అత్యంత ఖరీదైన వస్త్రాలు

చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతోంది. చిరంజీవి సరసన నాయికగా నయనతార నటించగా, మరో ముఖ్యమైన యువరాణి పాత్రలో తమన్నా నటించారు. తాజాగా ఆమె ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారు.

ఈ సినిమా కథా నేపథ్యం కారణంగా తెరపై నేను విభిన్నమైన వేషధారణతో కనిపిస్తాను. నా పాత్రకి తగినట్టుగా నేను భారీ లెహెంగాలను ధరించాను. నేను ధరించిన వస్త్రాలను చిరంజీవిగారి పెద్ద కుమార్తె సుస్మిత .. ప్రముఖ డిజైనర్ అంజూ మోదీతో కలిసి డిజైన్ చేశారు. సినిమా పరంగా నేను ఇంతవరకూ ధరించిన అత్యంత ఖరీదైన వస్త్రాలు ఇవే. నా వస్త్రధారణ నా పాత్రకి మరింత ప్రత్యేకతను తీసుకొస్తుంది. ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. నా పాత్ర కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చారు.  

chiranjeevi
nayanathara
tamanna
  • Loading...

More Telugu News