trump: భారత్ పై మరోసారి అసహనం వ్యక్తం చేసిన ట్రంప్

  • మా బైక్ లపై అత్యధిక సుంకాలను విధిస్తున్నారు
  • దీన్ని మేము అంగీకరించలేము
  • 'సుంకాల రారాజు' భారత్

అమెరికాకు చెందిన ఖరీదైన 'హ్యార్లీ డేవిడ్సన్' మోటార్ బైక్ లపై అత్యధిక సుంకాలను విధిస్తున్నారని... దీన్ని తాము అంగీకరించలేమని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అమెరికా ఒక బ్యాంకులాంటిదని.... ప్రతి ఒక్కరూ తమ దేశాన్ని దోచుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. తన నాయకత్వంలో ఇలాంటి దోపిడీలు ఎంతో కాలం సాగవని హెచ్చరించారు.

తమ మోటార్ బైక్ లపై భారత్ 100 శాతం సుంకాన్ని విధించిందని... ఇదే సమయంలో తాము మాత్రం ఎలాంటి సుంకాలను విధించలేదని చెప్పారు. తన కోరిక మేరకు ఈ సుంకాన్ని మోదీ 50 శాతానికి తగ్గించారని... దీన్ని కూడా తాము అంగీకరించలేమని... ఈ సుంకాన్ని సున్నా శాతానికి తీసుకొస్తారని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

ప్రపంచంలో అత్యధిక సుంకాలను వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ట్రంప్ విమర్శించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలను వసూలు చేస్తోందని అన్నారు. భారత్ ను 'సుంకాల రారాజు'గా అభివర్ణించారు.

  • Loading...

More Telugu News