Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ‘రాజన్న బడిబాట’ను నిర్వహించనున్న జగన్ ప్రభుత్వం!

  • రేపటి నుంచి 3 రోజుల కార్యక్రమం
  • సంబరాలు నిర్వహించాలని ఆదేశం
  • విద్యాశాఖకు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో ఎండాకాలం సెలవులు ముగిశాయి. రేపటి నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యను పెంచడంపై ఏపీ ప్రభుత్వం ద‌ృష్టి సారించింది. ఇందుకోసం ‘రాజన్న బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. రేపటి నుంచి ఈ నెల 15 వరకూ మూడు రోజుల పాటు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్ని స్కూళ్లలో సంబరాలు నిర్వహించాలనీ, పాఠశాలలను అందంగా అలంకరించి, జాతీయ గీతాలాపనతో బడిబాట ప్రారంబించాలని సూచించింది. అలాగే మొదటి మూడు రోజులు వివిధ కార్యక్రమాలతో సంబరాలు నిర్వహించాలని పేర్కొంది. తద్వారా చిన్నారులకు పాఠశాలలపై భయం పోగొట్టి, చదువుకునేలా చేయొచ్చని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

  • Loading...

More Telugu News