Andhra Pradesh: అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు.. అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఆగ్రహం!

  • కలెక్టర్ సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీలు
  • కనీస సౌకర్యాలు, పరిశుభ్రత లేకపోవడంపై ఆగ్రహం
  • వెంటనే ప్రక్షాళన చేపట్టాలని కలెక్టర్ కు ఆదేశం

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ సత్యనారాయణతో కలిసి ఈరోజు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు కనీస సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, పరిశుభ్రత మచ్చుకైనా లేకపోవడం చూసి ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు.

ఆసుపత్రిలో సౌకర్యాలు ఇంత అధ్వానంగా ఉంటే ఏం చేస్తున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ జగన్నాథ్ పై మండిపడ్డారు. మీడియాలో కథనాలు వచ్చినా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? అని తలంటారు. ఆసుపత్రిని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. ఈ సందర్భంగా పలువురు రోగులను ఎమ్మెల్యే పరామర్శించి, చికిత్స తీరుపై అడిగి తెలుసుకున్నారు. 

Andhra Pradesh
Anantapur District
raids
YSRCP
ananta venkarta ramiraddy
collector]
  • Loading...

More Telugu News