modi: మోదీ ప్రయాణించే విమానమార్గానికి అనుమతించిన పాకిస్థాన్
- కిర్గజ్ స్థాన్ వెళ్లనున్న మోదీ
- షాంఘాయ్ సహకార సంస్థ సదస్సుకు హాజరుకానున్న ప్రధాని
- విమానం ప్రయాణించేందుకు అనుమతి కోరిన భారత్
బాలాకోట్ దాడుల అనంతరం తన గగనతలాన్ని పాకిస్థాన్ మూసివేసిన విషయం తెలిసిందే. పాక్ అధీనంలో 11 వాయు మార్గాలు ఉండగా... వీటిలో రెండు రూట్లలో మాత్రమే భారత విమానాలు ప్రయాణించేందుకు పాక్ అనుమతించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పాక్ గగనతలంలో ప్రయాణించేందుకు అనుమతించాల్సిందిగా భారత ప్రభుత్వం చేసిన విన్నపానికి పాక్ సానుకూలంగా స్పందించింది.
ఈ నెల 13, 14 తేదీల్లో కిర్గిజ్ స్థాన్ లో జరగనున్న షాంఘాయ్ సహకార సంస్థ సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. ఇప్పుడు అనుమతి ఉన్న రెండు రూట్లలో కాకుండా ప్రధాని మోదీ విమానం మరో రూట్ లో ప్రయాణించాల్సి రావడంతో మన ప్రభుత్వం పాక్ కు ఈ మేరకు విన్నవించింది.