Panjab: అయ్యో పాపం... బోరు బావిలో నుంచి సజీవంగా బయటపడ్డ బాలుడు చికిత్స పొందుతూ మృతి!

  • ఆసుపత్రికి తరలించిన రెండు గంటల్లోనే మృతి
  • బోరుబావిలో నాలుగు రోజులు ప్రాణాలతో 
  • ఫత్వీర్ సింగ్ మరణంతో గ్రామంలో విషాదం

చిమ్మ చీకట్లో దాదాపు ఐదు రోజుల పాటు సజీవంగా ఉన్న బాలుడు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పంజాబ్ లోని సంగ్రూర్ ప్రాంతంలో ఆడుకుంటూ వెళ్లి మూతలేని బోరుబావిలో పడిన చిన్నారి ఫత్వీర్ సింగ్, 150 అడుగుల లోతున్న బావిలో పడగా, నాలుగున్నర రోజుల పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమించారు. దాదాపు 110 గంటల తరువాత, ప్రాణాలతోనే ఉన్న చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న బాలుడు మరణించాడు. దీంతో సంగ్రూర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ బిడ్డ బయటకు వచ్చాడన్న తల్లిదండ్రుల ఆనందం నిమిషాల్లో ఆవిరైపోగా, నాలుగు రోజుల నుంచి తాము చేసిన పూజలు దేవుడికి చేరలేదని గ్రామస్థులు సైతం బోరున విలపించారు.

Panjab
Well
Pathveer singh
Died
NDRF
  • Loading...

More Telugu News