Kishan Reddy: కేంద్ర ఆర్థిక మంత్రి తెలుగింటి కోడలే.. టూరిజం మంత్రి నా శిష్యుడే: కిషన్‌రెడ్డి

  • అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా
  • కేంద్రం నుంచి రావల్సిన నిధులన్నీ రాబట్టుకుందాం
  • ఇద్దరు ఓఎస్డీల ద్వారా మానిటరింగ్ చేస్తా
  • పోలీసులు, జీహెచ్ఎంసీల పని తీరు బాగుంది

మౌలిక వసతుల కల్పనకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి తెలుగింటి కోడలేనని.. కేంద్ర టూరిజం మంత్రి తన శిష్యుడేనని కాబట్టి కేంద్ర మంత్రిగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానన్నారు.

కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ రాబట్టుకుందామన్నారు. భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ కాపాడటంలో జీహెచ్‌ఎంసీదే కీలక పాత్ర అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇద్దరు ఓఎస్డీలను నియమించుకుని హైదరాబాద్‌ను మానిటరింగ్ చేస్తానన్నారు. సికింద్రాబాద్ అభివృద్దే తన లక్ష్యమన్నారు. నగరాభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా పని చేద్దామన్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీల పని తీరు చాలా బాగుందని కిషన్‌రెడ్డి ప్రశంసించారు.

Kishan Reddy
Tourism
Hyderabad
Police
GHMC
Secunderabad
  • Loading...

More Telugu News