Ramesh: అన్నవరంలో విషాదం.. విషాహారం తిని అనుమానాస్పద స్థితిలో తల్లీకుమారుల మృతి

  • వేధింపులే మృతికి కారణమంటున్న బంధువులు
  • కట్నం కోసం కొంతకాలంగా వేధిస్తున్నారని ఆరోపణ
  • ముగ్గురినీ అత్తింటివారే హత్య చేశారని అనుమానం

విషాహారం తిని తల్లీకుమారులు మృతి చెందిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో చోటు చేసుకుంది. అన్నవరం గ్రామానికి చెందిన రమేష్ వివాహం, విశాఖ జిల్లా నాతవరం మండలం కె. నాయుడుపాలేనికి చెందిన సుష్మ రాజ్యలక్ష్మితో ఏడేళ్ల క్రితం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దీపుకి ఆరేళ్లు, చిన్న కుమారుడికి తొమ్మిదో నెల.

నేడు తల్లీకుమారులు విషాహారం తిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరి మృతికి అత్తామామలే కారణమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను కొంత కాలంగా అత్తమామలు ఆస్తి కోసం వేధిస్తున్నారని ఈ క్రమంలోనే ఆ ముగ్గురినీ హత్య చేశారంటూ మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Ramesh
Sushma Rajya Lakshmi
Annavaram
Police
Case Filed
  • Loading...

More Telugu News